
మానవ హక్కుల ఫోరం సభ్యుడిగా మంగరాజు
తాడేపల్లిగూడెం (టీఓసీ): జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (ఎన్‌హెచ్‌ఆర్‌పీ ఫోరం) ఎస్సీ, ఎస్టీ వింగ్‌కు జాతీయ సభ్యునిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు నియమితులయ్యారు. సంస్థ జాతీయ చైర్మన్ జేఎస్‌ఆర్ నాయుడు ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగరాజు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యునిగా రెండు సార్లు పనిచేశారు. ఫోరం సభ్యునిగా నియమితులైన మంగరాజును మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతాల శరత్ బాబు, నాయకులు నల్లి రాజేష్, తిరగటి శివ, గంటా సుందర్‌కుమార్ అభినందించారు.