
వసతి.. అధోగతి
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను సర్కారు నిర్లక్ష్యం పట్టిపీడిస్తోంది. పరిసరాల్లో పారిశుద్ధ్య లేమి.. సరిగాలేని టాయిలెట్స్.. తాగునీటి సమస్యలు.. దోమల బెడద.. నాణ్యత లేని ఆహారం.. విరిగిన బల్లలు.. మంచాలు లేక కటిక నేలపై నిద్ర.. వంటి సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు.
ఆదివారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 16 బాయ్స్, 13 గరల్స్ హాస్టళ్లు ఉండగా, సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 15 బాయ్స్, 20 గరల్స్ హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం 64 హాస్టళ్లకు గాను 32 హాస్టళ్లకు సొంత భవనాలు ఉండగా మిగిలినవి అద్దె భవ నాల్లో నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ ఆరుగొలను, నరసాపురం రూరల్ ఎల్‌బీచర్లలో గు రుకుల కళాశాలలు, పెనుగొండలో గురుకుల బాలికల పాఠశాల, తాడేపల్లిగూడెం రూరల్ పెదతాడేపల్లిలో గురుకుల బాలుర పాఠశాల ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా వసతి గృహాల్లో 5,329 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. హాస్టల్స్‌లోని పరిస్థితులపై జిల్లావ్యాప్తంగా ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగుచూశాయి.
సమస్యలు కోకోల్లలు
● పెనుమంట్ర మండలం పొలమూరులోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో 25 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.14 లక్షలతో చేపట్టిన హాస్టల్ భవనం, టాయిలెట్స్ మరమ్మతు పనులు ఆరు నెలలుగా నత్తనడకన సాగుతుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మంచాలు లేక నేల మీదే పడుకుంటున్నారు. జనరేటర్ గాని, ఇన్వెర్టర్ గాని లేక రాత్రి సమయంలో కరెంట్ పోతే ఇబ్బంది పడాల్సి వస్తోందని, రక్షిత నీటిని అందించే ఆర్‌ఓ ప్లాంట్ లేదని విద్యార్థులు చెబుతున్నారు. ట్యూటర్ లేక సాయంత్రం స్టడీ అవర్స్ సక్రమంగా జరగట్లేదు.
● భీమవరంలో ఒక ఎస్సీ, ఒక బీసీ బాలికల హాస్టల్, మూడు బీసీ బాయ్స్ హాస్టల్స్ ఉన్నా యి. పీపీ రోడ్డులోని బీసీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థులకు కనీసం పరుపులు లేవు. టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెంటేవారితోటలోని బీసీ బాయ్స్ హాస్టల్‌లో విద్యుత్ బోరు ప్రమాదకరంగా ఉంది. ఫ్యాన్లు మరమ్మతులకు గురై పనిచేయడం లేదు. టాయిలెట్స్ సరిగా లేవు. తాగునీటి సమస్య ఉంది. సన్న బియ్యం మూడు రోజులు మాత్రమే పెట్టారని, కోడిగుడ్లు సక్రమంగా ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
● నరసాపురంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద గల బీసీ బాయ్స్ హాస్టల్‌లో గుమ్మాలు చెదలు పట్టేసి కన్నాలు పడిపోవడంతో క్రిమికీటకాల బెడద ఉంది. బల్లలు లేక నేలమీద చదువుకోవడం, భోజనాలు చేయడం, నిద్రించాల్సి వస్తోందని, గోదావరి గట్టున ఉన్న హాస్టల్‌లో టాయిలెట్స్ శిధిలావస్థకు చేరి దుర్గంధం వెదజల్లుతున్నాయని, ఎల్‌బీ చర్ల గురుకుల పాఠశాలలో బల్లలు విరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు అంటున్నారు.
● తాడేపల్లిగూడెం రూరల్ పెంటపాడులోని ఎస్‌సీ హాస్టల్ నుంచి స్కూల్‌కు వెళ్లే దారి అధ్వానంగా ఉంది. దోమల బెడద ఎక్కువగా ఉండటంతో రాత్రిళ్లు నిద్ర ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ గరల్స్ హాస్టల్‌కు సొంత భవనం లేకపోవడంతో పాఠశాలలోని అరకొర గదుల్లోనే నిర్వహిస్తున్నారు.
● ఆకివీడులోని బీసీ హాస్టల్ వెనుక భాగంలో కిక్కిస దట్టంగా పెరిగిపోగా, ముందు భాగంలో డ్రెయిన్ పూడుకుపోయి మురుగునీరు హాస్టల్ ఆవరణలోకి వచ్చేస్తోంది. పరిసరాల్లో పారిశుద్ధ్య లేమితో దోమల సమస్య ఎక్కువగా ఉంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● తాడేపల్లిగూడెం రూరల్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాయ్స్ గురుకుల పాఠశాలలో 208 మంది విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. సబ్జెక్టు టీచర్లు లేరు. టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేదు. బెడ్స్ సదుపాయం లేక విద్యార్థులు నేలపైనే పడుకుంటున్నారు.
● పాలకొల్లులోని ఎస్సీ గరల్స్ హాస్టల్‌లో బెడ్స్ లేక నేలపై పరుపులు వేసుకుని పడుకోవాల్సి వస్తుందని విద్యార్థినులు అంటున్నారు.
వీరవాసరంలో జరిగిన బాబూ ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రసాదరాజు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
న్యూస్‌రీల్
వాగులే ఆవాసం.. పాములే ఆహారం
జిల్లాలో వసతి గృహాలు
కేటగిరీ సంఖ్య విద్యార్థులు
బీసీ హాస్టళ్లు 29 1,585
ఎస్సీ హాస్టళ్లు 35 1,624
గురుకుల పాఠశాలలు 2
కళాశాలలు 2 2,120
సంక్షోభంలో సంక్షేమం
ప్రభుత్వ వసతి గృహాలను వెంటాడుతున్న సమస్యలు
తాగునీరు, పారిశుద్ధ్య లేమి.. అధ్వానంగా మరుగుదొడ్లు
చీకటి పడితే దోమల బెడద
అవస్థలు పడుతూ సాగుతున్న విద్యార్థుల చదువులు
జిల్లాలో 68 హాస్టళ్లు.. 5,329 మంది విద్యార్థులు
}
శుభ్రం చేయించాలి
ఆకివీడులోని బీసీ బాయ్స్ హాస్టల్ ఆవరణలోకి మురుగునీరు చేరి దుర్గంధం వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ వెనుక భాగంలో మొక్కలు దట్టంగా పెరిగి పాములు వస్తున్నాయి. హాస్టల్ ఆవరణను శుభ్రం చేయించాలి.
– దండే ప్రేమ్‌కుమార్, 8వ తరగతి విద్యార్థి, ఆకివీడు
దోమలతో నిద్ర కరువు
రెండేళ్లుగా హాస్టల్‌లో ఉంటున్నాను. హాస్టల్ రూమ్‌లో డోర్లు పాడైపోయి చిల్లులు పడటంతో రాత్రిళ్లు దోమల సమస్యతో నిద్ర ఉండటం లేదు. తలుపులకు మరమ్మతులు చేయించాలి.
– పి.హరి, 8వ తరగతి,
బీసీ బాయ్స్ హాస్టల్ విద్యార్థి, నరసాపురం
జీతాలు ఇప్పించండి
గురుకుల హాస్టల్‌లో హెల్పర్‌ని. ఏడు నెలలుగా జీతాలు లేవు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఇక్కడ హాస్టల్‌లో చూస్తే పని ఎక్కువగా ఉంటుంది.
– గుంపుల రాంబాబు,
హెల్పర్, గురుకుల పాఠశాల, ఎల్‌బీ చర్ల

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి

వసతి.. అధోగతి