
చెట్ల నరికివేతపై వాల్టా యాక్ట్ అమలు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని కొండ్రుప్రోలు కేఎస్‌ఎన్ కాలనీలో ఏళ్ల నాటి చెట్లను నరికివేయడంపై ‘మాయమవుతున్న వన సంపద’అనే శీర్షికతో శుక్రవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. భీమవరం రేంజ్ అధికారి మురాల కరుణాకర్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఎస్.సురేష్‌కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బృందం కొండ్రుప్రోలులో పర్యటించింది. ఈ సందర్భంగా రేంజ్ అధికారి కరుణాకర్ మాట్లాడుతూ మామిడి, వేప, రావిచెట్టు, తాటి చెట్లు, గుల్‌మోహర్ చెట్ల కలపను గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు సంబంధిత శాఖ అధికారుల అనుమతితో బహిరంగ వేలం వేయాలని ఆదేశించామని తెలిపారు. అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వెల్లడించారు. ఏపీ వాల్టా చట్టం ప్రకారం విచారణ చేపడతామని తెలిపారు. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
స్పందన

చెట్ల నరికివేతపై వాల్టా యాక్ట్ అమలు