
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు అన్యాయం
కై కలూరు: రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వర రావు (డీఎన్నార్) మండిపడ్డారు. కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ మంగళవారం పోస్టర్లను అవిష్కరించారు. కూటమి పాలనలో జరుగుతున్న అన్యాయాలపై రెండు ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లపై ప్రదర్శన ఆకట్టుకుంది. డీఎన్నార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అక్రమ అరెస్టులను ఖండిచాలన్నారు.
రేషన్ షాపుల తనిఖీ
ఆకివీడు: రాష్ట్రంలో ఆకివీడులోని సచివాలయం–1 పరిఽధిలోని మూడు రేషన్ షాపులు అధ్వానంగా పనిచేస్తున్నాయని, ప్రజా వ్యతిరేకతలో ప్రథమ స్థానంలో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ రాహూల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మూడు రేషన్ షాపుల్ని తనిఖీ చేశారు. బియ్యం అమ్మకాలు, నిల్వల రికార్డు, బియ్యం పరిశీలించారు. అనంతరం డీలర్లతో మాట్లాడుతూ వినియోగదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, సమయానికి షాపు తెరవడం లేదని, వృద్ధులకు, ఇతరులకు వేలిముద్రలు వేయించుకుని సరుకులు ఇవ్వడంలేదనే ఆరోపణలు ప్రభుత్వ విచారణలో తేలాయని చెప్పారు. ఈ విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు. వీఆర్వోలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. ప్రతీ వంద మంది వినియోగదారుల వద్దకు వెళ్లి డీలర్ల వల్ల అసౌకర్యం జరుగుతుందా, సరుకులు బాగా ఇస్తున్నారా లేదా అనేది విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
సురక్షితంగా తల్లి చెంతకు
ఏలూరు టౌన్: ఏలూరు పాతబస్టాండ్ సమీపంలో రూరల్ ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో సోమవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనికీ చేశారు. ఆటోలో పాఠశాల యూనిఫాంతో బాలికను గుర్తించి ఆరా తీశారు. తల్లి మందలించటంతో ఇల్లు వదిలి విజయవాడ వెళ్ళాలనే ఉద్దేశంతో ఏలూరు వచ్చిందని తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఎస్సై పూర్తి వివరాలు సేకరించి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికను సురక్షితంగా తల్లికి అప్పగించారు.
దాడి ఘటనలో 12 మందిపై కేసు
పెదవేగి: ఓ వ్యక్తిపై దాడి చేసి అతని పామాయిల్ గెలలు అపహరించుపోయారన్న ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. పెదవేగి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. దెందులూరు మండలం సోమవరప్పాడుకు చెందిన వేమూరి బసవ పున్నయ్య పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో పామాయిల్ సాగు చేస్తున్నాడు. ఈ నెల 21న తోటలోని గెలలను కోసి పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీకి తరలిస్తుండగా, మధ్యలో సుమారు 25 బైక్‌లపై కొంతమంది దౌర్జన్యంగా బసవపున్నయ్య, ట్రాక్టర్ డ్రైవర్‌పై దాడి చేసి, కంట్లో కారం కొట్టి, బలవంతంగా పామాయిల్ గెలల లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను రామశింగవరం కలెక్షన్ పాయింట్‌కు తరలించి, అక్కడ అన్‌లోడ్ చేశారు. ఈ ఘటనలో వేంపల నాగరాజు, వెంపల తంబి, కల్లెం చినదాసు, ఉప్పె రంగరావు, దానం శ్రీను, చిమ్మె సురేష్, వలుకుల వినోద్, వలుకుల తాతబాబు, వలుకుల సుబ్రహ్మణ్యం, బొమ్మగంటి చిన్న సురేష్, బొమ్మగంటి పెద్ద సురేష్, పరుచూరి వరుణ్ చౌదరిలపై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు అన్యాయం