అమెరికాలో కేవీఎస్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

అమెరికాలో కేవీఎస్‌కు సన్మానం

Jul 23 2025 5:33 AM | Updated on Jul 23 2025 5:33 AM

అమెరి

అమెరికాలో కేవీఎస్‌కు సన్మానం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కళా రంగానికి, నాట్య రంగానికి చేస్తున్న సేవలకు అభినందిస్తూ తనను అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతినిధులు ఈ నెల 21వ తేదీన డల్లాస్‌ నగరంలో ఘనంగా సత్కరిచినట్టు కూచిపూడి నాట్య గురువు, కళారత్న కేవీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటాతో పాటు ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం, తానా సభ్యులు ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రముఖ సాహితి వేత్త, సంయుక్త కార్యదర్శి శారద సింగిరెడ్డి నిర్వహణలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ సతీష్‌ రెడ్డి, తానా పూర్వ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ కేవీ సత్యనారాయణ సేవలను కొనియాడారు. ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం వారు ఈ నెల 19న నిర్వహించిన నెల నెలా వెన్నెల సాహిత్య సభ వార్షికోత్సవంలో కేవీ సత్యనారాయణ ప్రదర్శించిన కాలార్చన గూర్చి ప్రశంసిస్తూ అభినందిచారు.

ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు జెస్సీ

దెందులూరు: సౌత్‌కొరియాలో ఈనెల 23 నుంచి జరిగే ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఇంటర్నేషనల్‌ స్కేటర్‌ ఎం.జెస్సీ మంగళవారం వెళ్లారు. కోచ్‌తో పాటు వెళుతున్న 9 మందిలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన మాత్రపు జెస్సీ ఒకరు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో విజయం సాధించాలని కుటుంబ సభ్యులు, బంధువులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు.

పోక్సో కేసులో

మూడేళ్ల జైలు

నూజివీడు: పోక్సో కేసులో ఓ ముద్దాయికి మచిలీపట్నంలోని పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. నిందితుడు రెడ్డి త్రిమూర్తులు 2019 మార్చి 26న రాత్రి 9 గంటల సమయంలో బాలికను పట్టణంలోని పెద్ద చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక అరవడంతో చుట్టుపక్కల వారు రాగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై బాలిక తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై సీహెచ్‌ రంజిత్‌కుమార్‌ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో మచిలీపట్నంలోని పోక్సో కోర్టు సెషన్స్‌ జడ్జి గాజుల వెంకటేశ్వర్లు ముద్దాయి రెడ్డి త్రిమూర్తులుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల జైలుశిక్షను అదనంగా అనుభవించాలని, బాధితురాలికి నష్టపరిహారం కింద రూ.50 వేలను చెల్లించాలని జడ్జి ఆదేశాలు జారీచేశారు.

అమెరికాలో కేవీఎస్‌కు సన్మానం 1
1/1

అమెరికాలో కేవీఎస్‌కు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement