
● రండి బాబు... రండి
ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించి నెల రోజులు దాటినా ఇంకా అడ్మిషన్లు
జరుగుతున్నాయంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పాఠశాలలు ప్రారంభమైన వారం రోజులకే క్లాస్‌రూమ్‌లు నిండిపోయి విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే పరిస్ధితి ఉండేది కాదు. ఎందుకంటే పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్‌తో పాటు సమయానికి అమ్మ ఒడి ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో సగం మంది తల్లులకు తల్లికి వందనం రాక.. నాణ్యమైన బ్యాగులు ఇవ్వక, సరిగ్గా పుస్తకాలు అందకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు పిల్లలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇలా ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఏలూరు లక్ష్మివారపుపేటలోని ఎలిమెంటరీ స్కూల్లో దర్శనమిచ్చిన ఫ్లెక్సీ ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు