
● ‘బ్యాక్ బెంచ్’కి చెక్
బ్యాక్ బెంచ్ విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు కలెక్టర్ వెట్రి సెల్వి విన్నూత్న ప్రయోగం చేపట్టారు. కేరళ తరహాలో యూ ఆకారంలో కూర్చునే విధంగా బెంచీలు వేయాలని ఆదేశించారు. దీనిని లింగపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ పంకజ్ కుమార్ అమలు చేశారు. యూ ఆకారంలో బెంచీలు అమర్చడం వలన విద్యార్థులంతా ఉపాధ్యాయునికి కనబడతారని, దీంతో ఆయన చెప్పే పాఠాలు బాగా అర్థమవుతాయన్నారు. పాఠశాలలోని విద్యార్థులు ఆన్‌లైన్ ప్రకారం ఉన్నారా లేరా డ్రాప్ బాక్స్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని రికార్డులు పరిశీలన చేశారు. – లింగపాలెం