
మావుళ్లమ్మకు సారె సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్): మావుళ్ళమ్మకు ఆదివారం భక్తులు వెయ్యి కిలోల ఆషాఢ సారె సమర్పించారు. క్వీన్ కిట్టి మహిళలు 51 రకాలతో 250 కిలోల సారె, విజయవాడ, ఆకివీడు, వీరవాసరం, భీమవరానికి చెందిన భక్తులు 200, 108 కేజీల చొప్పున సారె సమర్పించినట్లు ఆలయ సహాయ కమిషనర్ తెలిపారు. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సారె అందించిన భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నరసాపురం రూరల్: నరసాపురం మండలం సీతారామపురం సౌత్ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం సీతారామపురంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో మండలంలోని రుస్తుంబాద యడ్లపల్లి వారి తోట గ్రామానికి చెందిన పరసా సాయిచందు (26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న ఆనంద్, పి.రాజ్‌కు తీవ్రగాయాలు కావడంతో నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.