న్యూశాయంపేట: సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సంచార జాతుల విముక్తికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పుష్పలత, టీపీసీసీ చేనేత విభాగం వర్కింగ్ ప్రసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత, వివిధ కుల సంఘాల బాధ్యులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులతో
అప్రమత్తంగా ఉండాలి
దుగ్గొండి: సీజనల్ వ్యాధులు ప్రభలకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికా రి రాజారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ రకాల రికార్డులు, రిజిస్టర్లు, ఆరోగ్య కార్యక్రమాల అ మలు తీరును పరిశీలించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగాం ఆఫీసర్ డాక్టర్ సజిదా, వైద్యాధికారులు కిరణ్‌కుమార్, రాకేష్, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు టీపీటీఎస్ నిరసనలు
కాళోజీ సెంటర్: తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ మేరకు నేడు (మంగళవారం) మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా అమలు చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. కలెక్టరేట్, మండల తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
దొడ్డు బియ్యం
వేలానికి సిద్ధం!
ఖిలా వరంగల్: రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో వేలం వేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. లక్క పురుగులు.. ఎలుకల స్వైర విహారం పేరుతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లావ్యాప్తంగా 847 మెట్రిక్ ట న్నుల దొడ్డుబియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించి ఉ న్నతాధికారులకు నివేదిక పంపించారు. దీంతో వారు ఆన్‌లైన్‌లో టెండర్లు వేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. దొడ్డు బియ్యానికి కి లో రూ.21.60 ధర నిర్ణయించినట్లు తెలిసింది.


