కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతీ సంవత్సరం అడ్మిషన్లు పెరుగుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, షూస్ అందించడంతో విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. అలాగే అధ్యాపకుల కృషితో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 2,704 మంది విద్యార్థులకు త్వరలో యూనిఫాం కూడా అందుబాటులోకి రానున్నట్లు ఆయన వివరించారు.


