పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు

Aug 30 2026 1:39 AM | Updated on Aug 30 2026 1:39 AM

న్యూశాయంపేట: టీజీ–ఐపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు నిబంధనల మేర త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో టీజీ–ఐపాస్‌ ద్వారా పారిశ్రామిక అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులు, ఇతర అంశాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్న 19 పరిశ్రమలకు సంబంధించి 16.03 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో 152 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా టీప్రైడ్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించిన 9 వాహనాలకు 31.52 లక్షల రాయితీని కమిటీ ద్వారా మంజూరు చేశారు. సమావేశంలో ఇండస్ట్రీయల్‌ జీఎం నరసింహమూర్తి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జీవన్‌కుమార్‌, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌కు నివాళి

భారత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి కలెక్టర్‌ సత్యశారద, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత హాకీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కై లాసం యాదవ్‌, డీవైఎస్‌ఓ అనిల్‌కుమార్‌ తహసీల్దార్లు, కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement