వరంగల్ చౌరస్తా: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వరంగల్ చౌరస్తాలో బీజేవైఎం జిల్లా ఆధ్వర్యంలో 12గంటల నిరసన దీక్షను శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేని దుస్థితి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోని పాలకులు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల శ్రవణ్, నాయకులు ఆడెపు రవిరాము, రాళ్లబండి మున్నా, మహంత్, బాశెట్టి సాయి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీష్ షా, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, గోగుల రాణాప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
గంటా రవికుమార్
బీజేవైఎం ఆధ్వర్యంలో
12 గంటల నిరసన దీక్ష


