శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలి

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

నల్లబెల్లి: పట్టు సాగులో రైతులు శాసీ్త్రయ పద్ధతులు అవలంబిస్తూ, అధిక దిగుబడి సాధించాలని పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు తిరుపతిరెడ్డి సూచించారు. కేంద్ర పట్టు బోర్డు (సీఎస్‌బీ) మండలంలోని మేడపల్లిలో రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించింది. మల్బరీ సాగులో నూతన సాంకేతికత, శాసీ్త్రయ పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మల్బరీ సాగుచేసే రైతులు నేల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని, తగిన యాజమాన్య పద్దతులు పాటించాలని సూచించారు. పట్టు పురుగుల పెంపకంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. శాస్త్రవేత్త భువన, సెరికల్చర్‌ అధికారి మల్లయ్య, ఏఓ బన్న రజిత, ఏఈఓలు రాకేశ్‌ పాల్గొన్నారు.

పట్టు పరిశ్రమ శాఖ

సహాయ సంచాలకులు తిరుపతిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement