వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సమస్యలపై సమరభేరి..

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

కాజీపేట అర్బన్‌ : ‘నా దారి రహదారి.. బెటర్‌ డోంట్‌ కమిన్‌ టు మై వే’ అనే సినిమా డైలాగ్‌ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్‌ వాహనం ఇటీవల నిట్‌ వరంగల్‌కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్‌లో అడ్వాన్స్‌ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు.

నిట్‌తో ఎంఓయూ..

ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన

మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం

నిట్‌ వరంగల్‌తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు

ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తం

మెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజనీరింగ్‌ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్‌ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్‌ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్‌ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా విజన్‌లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement