కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ప్రయోగశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ సూచించారు. ఖిలా వరంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధునీకరించిన ప్రయోగశాలను డీఐఈఓ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల కళాశాలల్లో ప్రయోగశాలల నవీకరణకు నిధులు మంజూరు చేసిందని, ల్యాబ్‌లను వినియోగంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పుష్పలత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యాంకుమార్, అడ్వకేట్ జీవన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


