డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు సహకరించాలి

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

నెక్కొండ: డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయభాస్కర్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో నిర్వహిస్తున్న డిజటల్‌ క్రాప్‌ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి మొదలైన సర్వేలో నమోదైన పంటల సాగు వివరాల ఆధారంగా కొనుగోలుకు వివరాలు ఉపయోగపడుతాయన్నారు. ఎల్‌నీనో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన కల్పించారు. రాబోయే రోజు ల్లో సోయాబీన్‌ పంట విస్తీర్ణం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ నాగరాజు, ఏఈఓలు వసంత, అఖిల్‌, అరుణ్‌, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని డీఏఓ, మండల ప్రత్యేక అధికారి విజయభా స్కర్‌ అన్నారు. మండలంలోని నెక్కొండ తండా ప రిధిలోని పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ ఆవరణలో మంగళవారం వన మహోత్సవంలో భాగంగా పలువురితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నెక్కొ ండ పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్లా శ్రీపాల్‌రెడ్డి, స్థానిక ఏ ఎంసీ చైర్మన్‌ రావుల హరీశ్‌రెడ్డి, ఎంపీడీఓ యాసం లావణ్య, ఏపీఓ జాకబ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డీఏఓ విజయభాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement