ప్రాధాన్యతా క్రమంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యతా క్రమంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

న్యూశాయంపేట: రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేయాలని, ప్రతీ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వర్షాభావ పరిస్థితులు, నీట్‌ పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో నర్సంపేట బిట్స్‌ కాలేజీలో నీట్‌ పీజీ పరీక్ష కేంద్రంలో 132 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. నిబంధనల మేరకు సంబంధిత అధికా రులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. వీసీలో కలెక్టర్‌తో పాటు డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఇన్‌చార్జ్‌ పర్యాటక శాఖా ధికారి విజయభాస్కర్‌, జిల్లా పరిశ్రమల అధి కారి నరసింహామూర్తి, తదితరులు పాల్గొన్నారు.

వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement