పరకాల: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. వనమహోత్సవంలో భాగంగా వెల్లంపల్లి గ్రామం, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రజలు విద్యార్థులు, అధ్యాపకులు వనమహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, వైస్ చైర్మన్ ఏకు దివ్య, తహసీల్దార్ టి.విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సంతోష్‌కుమార్, ఇన్‌చార్జ్ కమిషనర్ సీహెచ్ గిరిబాబు, టీఓ డి.రాము, శానిటేషన్ అధికారి జి.వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు అల్లె దశరథం, పసుల లావణ్య, గూడెల్లి సదన్‌కుమార్, బండి శ్రీధర్, బొచ్చు సుభద్ర, పాలకుర్తి శ్రీనివాస్, సుదమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి


