పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల ఆందోళన

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

పరకాల: పాలిటెక్నిక్‌ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పరకాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు అంబేడ్కర్‌ కూడలిలో మహాధర్నా నిర్వహించారు. ఈధర్నాతో గంటసేపు వాహనాలు నిలిచి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ధర్నా విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఏబీవీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈధర్నాను ఉద్దేశించి ఏబీవీపీ పరకాల కార్యదర్శి బాల్సుకూరి కార్తీక్‌ మాట్లాడుతూ యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని పీపీపీ విధానంలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులు, అధ్యాపకులకు న్యాయం జరిగే వరకు ఏబీవీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. మంగళవారం (నేడు) నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త పాలిటెక్నిక్‌ కళాశాలల బంద్‌ను విజయవంతం చేయలని పిలుపునిచ్చారు. ధర్నాలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు ఆకుతోట భానుప్రసాద్‌రావు, భాషబోయిన జశ్వంత్‌, భరణి, గౌతమ్‌, అభి, అజయ్‌, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement