నాకు ఇద్దరు కుమారులు. నాకున్న 4.15 గుంటల వ్యవసాయ భూమిని నా పెద్ద కుమారుడు ఆక్రమించాడు. నాకు మంద బుద్ధి గల కుమార్తె కూడా ఉంది. మా బాగోగులను వారు చూడడం లేదు. ఈ క్రమంలో బతకడం కష్టంగా ఉంది. ఈ విషయమై ఆర్‌డీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చినా న్యాయం జరగడం లేదు.
– ఏ.రాజమ్మ, మహ్మదాపురం, దుగ్గొండి
నా ఉద్యోగం ఇచ్చా.. బాగోగులు చూడడం లేదు
నాకు ఒక కుమారుడు, ఆరుగురు కుమార్తెలు. నేను ముప్పై ఏళ్ల క్రితం వలంటరీ రిటైర్‌మెంట్ ఇచ్చి నా కుమారుడికి ఉద్యోగం పెట్టించా. ఆయన మా బాగోగులు చూడడం లేదు. ఇదేంటని అడిగితే గొడవకు దిగుతున్నాడు. మాకు ఇంకా పెళ్లికాని కుమార్తె కూడా ఉంది. – ఎస్.లక్ష్మయ్య, పర్వతగిరి


