న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026
●ఇల్లు: నలుగురున్న కుటుంబం నెలకు 4 కిలోల చక్కెర వినియోగిస్తే రూ.300. పాత ధర రూ.40 అయితే రూ.160. నెలకు రూ.140 అదనపు భారం
●టీ దుకాణం: రోజుకు 5 కిలోలు వాడితే నెలకు 150 కిలోలు. రూ.75 ధరతో రూ.11,250. రూ.40 వద్ద రూ.6 వేలు. నెలకు రూ.5,250 అదనపు ఖర్చు
●స్వీట్ షాప్: రోజుకు 20 కిలోలు వాడితే నెలకు 600 కిలోలు. రూ.75 వద్ద రూ.45 వేలు పాత ధరతో రూ.24 వేలు. నెలకు రూ.21 వేల అదనపు భారం
వాతావరణం
జిల్లాలో ఉదయం వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం సాధారణ వర్షం కురవనుంది. సాయంత్రం వాతావరణం మేఘావృతమై ఉంటుంది.
వరంగల్ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్ మీదుగా అమృత్‌భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సాక్షి, వరంగల్: తీపిని పంచే చక్కెర ధర ఇప్పుడు చేదు పుట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం కిలో రూ.40కి లభించిన పంచదార.. ప్రస్తుతం కొన్ని స్థానిక కిరాణా దుకాణాల్లో ఏకంగా రూ.75 వరకు ధర పలుకుతోంది. ఒక్కసారిగా అమాంతం పెరిగిన ధరతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. టీ, కాఫీ నుంచి స్వీట్లు, పిండి వంటల్లో నిత్యావసరంగా మారిన చక్కెర ధర పెరగడంతో నెలవారీ ఇంటి బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. జిల్లాలో నెలకు దాదాపు 1,500 టన్నుల విక్రయాలు జరుగుతుండడంతో ఇప్పటివరకు రూ.6 కోట్లు హోల్‌సేల్ వ్యాపారం జరిగితే ఇప్పుడు పెరిగిన ధరలతో ఏకంగా రూ.11.25 కోట్లు అవుతోంది. సంవత్సరానికి ఏకంగా రూ.135 కోట్లవుతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పంట తగ్గుదల.. నిల్వల ప్రభావం
పంచదార ధరల పెరుగుదల వరంగల్‌కే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా ధరలు గణనీయంగా పెరిగాయి. జూలైలో కిలోకు సుమారు రూ.48 వద్ద ఉన్న ధర ఆగస్టు 20 నాటికి సగటున రూ.55.70కు చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిటైల్ ధర రూ.60 దాటగా.. మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో రూ.75 నుంచి 80 వరకు చేరాయి.
చెరుకు పంటపై ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం, ఉత్పత్తి అంచనాలు తగ్గడం, రాబోయే పండుగల నేపథ్యంలో డిమాండ్ పెరగడం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనికి తోడు మార్కెట్‌లో ఊహాగానాలు, నిల్వలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దేశంలో చక్కెర కొరత లేదని భారత చక్కెర మిల్లుల సంఘం స్పష్టం చేస్తున్నా ఒక్కసారిగా పెరిగిన ధరలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ఆన్‌లైన్‌లో కాస్త తక్కువే..
ఈ సమయంలో ఆన్‌లైన్ మార్కెట్‌లో బ్రాండ్, ప్యాక్ పరిమాణాన్ని బట్టి ధరల్లో తేడా కనిపిస్తోంది. వరంగల్ డెలివరీకి అందుబాటులో ఉన్న కొన్ని ఆన్‌లైన్ లిస్టింగ్‌లో కిలో చక్కెర రూ.60 నుంచి 72 మధ్య ఉంటోంది. స్థానిక దుకాణాల్లో రూ.70 నుంచి 75కు విక్రయిస్తుండగా.. ఆన్‌లైన్‌లో ఆఫర్లు, డిస్కౌంట్లతో రూ.60 నుంచి రూ.66లోనే లభిస్తుండడంపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
చక్కెర చేదు!
ఇదీ లెక్క..
కిలో రూ.40 నుంచి ఏకంగా రూ.75కు పెరిగిన ధర
ఆందోళనలో వినియోగదారులు
నిత్యావసరాల్లో ఒకటి కావడంతో తప్పని భారం
జిల్లాలో నెలకు 1,500 టన్నులకుపైగా వినియోగం


