– 8లోu
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రైతుబీమా పథకాన్ని పునరుద్ధరించని ప్రభుత్వం
●
● ఈనెల 13న ముగిసిన
ప్రీమియం చెల్లింపు గడువు
ఖిలా వరంగల్: రైతు కుటుంబానికి అండగా నిలిచేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకొని రైతుబీమా పథకం (ఫార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం)ను ప్రారంభించింది. నాటి నుంచి రైతులు ఏ కారణంతోనైనా మరణించినా బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిష్కరించి, రూ.5 లక్షల బీమా మొత్తాన్ని నామినీ ఖాతాలో జమ చేసే బాధ్యతను అప్పగించింది. ఈ పథకాన్ని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు వారికి వర్తింపజేసింది. ప్రతి ఆగస్టు నెలలో ప్రభుత్వం అర్హులైన రైతుల బీమా ప్రీమియం సొమ్మును చెల్లించి పాలసీని పునరుద్ధరింపజేస్తూ వచ్చింది. ఏటా ఆగస్టులో కొత్త దరఖాస్తుల స్వీకరణ, పాత వాటి పునరుద్ధరణ చేపట్టింది. కానీ, ఈసారి ప్రభుత్వం అమలు చేయలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రూ.5 లక్షల ఆర్థిక సాయం..
18 నుంచి 59 సంవత్సరాల్లోపు ఉన్న రైతులు బీమా కలిగి మృతి చెందితే రూ.5 లక్షల ఆర్థిక సాయం ఈ పథకం కింద అందజేస్తారు. రైతులకు కనీసం గుంట భూమి, పట్టాపాసు పుస్తకం ఉండాలి. సర్కారు ఒక్కో రైతుకు ఏటా రూ. 2,271 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
పునరుద్ధరణపై కరువైన స్పష్టత..
ప్రభుత్వం గతేడాది పాలసీ ప్రీమియంను ఆగస్టు 14న చెల్లించింది. ఆ గడువు ఈనెల 13 అర్ధరాత్రితో ముగిసింది. బీమా పునరుద్ధరణకు ప్రభుత్వం ఇప్పటివరకు ప్రీమియం సొమ్ము చెల్లించలేదు. దీంతో బీమా పునరుద్ధరణ, పథకం కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మరణించిన కొంతమంది రైతుల కుటుంబాలకూ పాలసీ మొత్తం సొమ్ము అందలేదు. ఈనేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈపథకాన్ని రద్దు చేసినా, లేదా మార్పులు చేర్పులు చేసినా తమ డబ్బులు వస్తాయోలేదోనని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుబీమా పథకాన్ని పునరుద్ధరించాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు.
కరువు వేళ ‘ఆయిల్‌పామ్’ జోరు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిపడా కురవక కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆయిల్‌పామ్ సాగు జోరందుకుంది.


