న్యూశాయంపేట: జిల్లా స్థాయిలో కలెక్టరేట్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయం, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేవెన్స్‌లో అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
గేటర్ గ్రీవెన్స్..
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూజీఎం) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
హనుమకొండ కలెక్టరేట్‌లో..
హన్మకొండ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. కలెక్టరేట్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
సౌత్‌జోన్ పారా త్రోబాల్‌లో రమాదేవికి స్వర్ణం
పర్వతగిరి: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈనెల 22న జరిగిన సౌత్ జోన్ పారా త్రోబాల్ ఛాంపియన్ పోటీల్లో పోకల రమాదేవి పాల్గొని ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన రమాదేవి పుట్టుకతో వచ్చిన వైకల్యం తన లక్ష్యానికి అడ్డంకి కాదని నిరూపించింది. తన భర్త పోకల శ్రీశైలం సహకారంతో పారా త్రోబాల్‌లో క్రమం తప్పకుండా సాధన చేస్తూ కోచ్ సింగారపు బాబు శిక్షణలో తన ప్రతిభను రమాదేవి మెరుగుపర్చుకుంది. ఈ సందర్భంగా ఆమెను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.
కాజీపేట రైల్వే సీసీసీగా మౌలాషరీఫ్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం చీఫ్ క్రూ కంట్రోలర్ (సీసీసీ)గా ఎండీ మౌలాషరీఫ్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. కాజీపేట సీసీసీగా పనిచేస్తున్న సాంబశివుడిని సికింద్రాబాద్ రైల్వే అధికారులు ఆన్‌లైన్ విధులకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో కాజీపేట రైల్వే డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మౌలాషరీఫ్‌ను అధికారులు కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి సీసీసీగా బదిలీ చేశారు. కాగా, మౌలాషరీఫ్ గతంలో కాజీపేట, డోర్నకల్ సీసీసీ పనిచేశారు.
బోటు షికారు
గోవిందరావుపేట: లక్నవరం సరస్సు ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. సరస్సు అందాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులు బోటు షికారుతో పాటు జిప్‌లైన్ పై సైక్లింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ ఉన్న పచ్చని కొండలు, నీటి అందాలను ఆస్వాదిస్తూ బోటులో షికారు చేశారు. లక్నవరం సరస్సు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందడంతో పాటు బోటింగ్, సస్పెన్షన్ బ్రిడ్జి, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి చూస్తూ పర్యాటకులు ఆనందంగా గడిపారు.
రామప్పలో సండే సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని అటవీశాఖలో శిక్షణ పొందుతున్న బీట్ ఆఫీసర్లు దేవాలయానికి చేరుకుని రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతజీ గైడ్ వెంకటేశ్ వివరించగా శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని వారు కొనియాడారు.


