జిల్లాలో ఉదయం వాతావరణ చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో చిరు జల్లులు కురవనున్నాయి.
లలితాదేవికి ప్రత్యేక అలంకరణ
శ్రావణ మాసం, మూల నక్షత్రం, పుత్రదా ఏకాదశి సందర్భంగా ఆదివారం వరంగల్ శివనగర్‌లోని శ్రీసీరామచంద్రస్వామి దేవా లయంలో శ్రీలలితాదేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి వెంకటేశ్వర్లచార్యులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 160 చీరలతో శ్రీలలితాదేవిని అలంకరించి పూజలు నిర్వహించారు. చీరలతో అలంకరణలో ఉన్న శ్రీలలితాదేవిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మంచాల కృష్ణమూర్తి, శ్రీరాం రాజేశ్, అడెపు శ్యామ్, కుడికాల సుధాకర్, వీరస్వామి, సాంబయ్య పాల్గొన్నారు.
– ఖిలా వరంగల్


