అభివృద్ధి పనులకు నిధులు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు నిధులు

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

గీసుకొండ: మండలంలోని పలు గిరిజన గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.7.01 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సభ్యసాచిఘోష్‌ పేరుతో శనివారం ఉత్తర్వులు వెలవడ్డాయి. దస్రుతండా గ్రామపంచాయతీ పరిధిలోని సింగ్యా తండాలో రూ.15 లక్షలతో ఎస్టీ కమ్యూనిటీహాల్‌, దస్రుతండాలో 10 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 1.54 కోట్లు, నాలుగు సైడ్‌ కాల్వల నిర్మాణానికి రూ.23.30 లక్షల నిధులు కేటాయించారు. హర్జ్యాతండాలో కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి రూ.15 లక్షలు, నాలుగు సీసీరోడ్ల నిర్మాణానికి రూ.33.70 లక్షలు, 6 సైడ్‌ కాల్వల నిర్మాణానికి రూ.46 లక్షలు, సూర్యతండాలో కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి రూ.15 లక్షలు, 22 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3.86 కోట్లు, రెండు సైడ్‌ కాల్వలకు రూ.13 లక్షల నిధులు మంజూరయ్యా యని రాంపురం, వంచనగిరి, దస్రుతండా, సూర్యతండా, మనుగొండ సర్పంచ్‌లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement