సంగెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్‌సీడీ (అసంక్రమిత వ్యాధుల)ని సమర్థవంతంగా అమలు చేయాలని పబ్లిక్‌హెల్త్ అబ్జర్వర్ సెంట్రల్ టీం ప్రాజెక్టు హెల్త్ మేనేజర్ డాక్టర్ సామ్ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యాధుల సర్వేలెన్స్ ప్రోగ్రాం పరిధిలో 9 ఆరోగ్య విభాగాల కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, నివేదికలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి బాధితులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని ఆదేశించారు. రోగుల వివరాలను పక్కాగా నమోదు చేసి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి ఇక్తదార్ అహ్మద్, ఐడీఎస్సీ ప్రోగ్రాం అధికారి అరుణ్‌జోషి, మండల వైద్యాధికారి వంశీకృష్ణ, నవీన్, డీపీఎంయూ అర్చన, ఎన్‌సీడీ సూపర్‌వైజర్ ప్రకాశ్, సీహెచ్‌ఓ చిన్నబ్బాయి, హెచ్‌ఈఓ సాంబయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


