నియోజకవర్గ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

వర్ధన్నపేట: నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషిచేయనున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. రూ.3.14 కోట్లతో చేపట్టిన వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు అభివృద్ధి పనులకు గురువారం ఆయన మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా కోనారెడ్డి చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేసి పంటలకు కాల్వల ద్వారా నీరందించాలని అధికారులకు సూచించారు.

రాజీవ్‌గాంఽధీకి నివాళి..

పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ షీభారాణి రాజేందర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్‌, ఏఎంసీ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, ఐనవోలు ఆలయ చైర్మన్‌ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్‌, కౌన్సిలర్లు పాపారావు, వాణి కుమారస్వామి, కీమానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement