ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
గంజాయి కేసుల
వివరాలు
విలువ (రూ.కోట్లలో)
486
2.60
139
58
86
46
34
196
2023
2024
2025
2026
● గంజాయికి బానిసవుతున్న విద్యార్థులు
● పోలీసుల అదుపులో మైనర్లు
నమోదైన కేసులు పట్టుబడిన నిందితులు
నర్సంపేట: తమ పిల్లలు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలుగంటున్న తల్లిదండ్రుల ఆశలు గంజాయి మాటున ఆవిరైపోతున్నాయి. పాఠశాల స్థాయిలోనే గంజాయికి విద్యార్థులు బానిసవుతున్నారు. ఇటీవల పలువురు మైనర్లు గంజాయితో పోలీసులకు చిక్కడం నర్సంపేటలో కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ సీనియర్ జర్నలిస్టుపై బీరు సీసాతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
పర్యవేక్షణ కరువు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతీరోజు ఎక్కడో ఒకచోట గంజాయి సేవించడమో లేదా గంజాయి సరఫరా చేయడం లాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రధానంగా నర్సంపేట, జనగామ, వరంగల్ లాంటి ప్రధాన నగరాల్లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, తదితర కళాశాలల్లోని కొంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి సేవిస్తున్న ఇద్దరు మైనర్ విద్యార్థులను నర్సంపేట సబ్ డివిజన్ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పర్యవేక్షణ కొరవడడంతోనే యువత పెడదారిన పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా
కొంతమంది ఎండు గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి నర్సంపేట, వరంగల్ మీదుగా ఇతర ప్రాంతాలకు గుట్టుగా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల్లో గంజాయిని తరలిస్తున్న రవాణాదారులు ఖానాపురం ప్రాంతంలో రెండుసార్లు పట్టుబడ్డారు. వాహనాల్లో ప్రత్యేక ర్యాకులు ఏర్పాటు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి రహదారిపై మార్గమధ్యంలో ఉన్న కళాశాలల ప్రాంతాల్లో సరఫరాదారులు విక్రయిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యువతను ప్రత్యేక కోడ్ ద్వారా ఆకర్షిస్తున్నట్లు సమాచారం.


