హన్మకొండ చౌరస్తా: మాతా, శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే తగిన చర్యలు తప్పవని హనుమకొండ డీఎంహెచ్‌ఓ రాంకుమార్ హెచ్చరించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఆదివారం సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ వివరించారు. ప్రసవం కోసం వచ్చిన, ప్రసవించిన మహిళలతో ఆయన మాట్లాడారు. వారికి పీహెచ్‌సీ స్థాయిలో ఆశలు, ఏఎన్‌ఎంలు, వైధ్యాదికారుల ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు, 102 వాహన సౌకర్యాలను వినియోగించుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు.


