● పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం
● నెక్కొండలో లబ్ధిదారుల డిమాండ్
నెక్కొండ: నెక్కొండ పోస్టుమాస్టర్ రత్నమాల తీరుతో ఇబ్బందులు పడుతున్నామని పింఛన్‌దారులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రజాసంఘాలు, గ్రామస్తుల సహకారంతో గురువారం నెక్కొండ పోస్టాఫీస్ ఆవరణలో ఆందోళనకు దిగారు. పోస్టుమాస్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులతో దురుసుగా ప్రవరిస్తున్న పోస్టుమాస్టర్ తమకు వద్దని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో జాప్యం చేస్తోందని, తీరులో మార్పు లేనందున బదిలీ చేయాలని కోరారు. సదరు పోస్టుమాస్టర్‌పై శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఆందోళనకారులు దాసరి శ్రీనివాస్, రవిబాబు, రేగుల అశోక్, వరుణ్, శ్రీకాంత్, వినోద్, చంద్‌పాషా, వీరమ్మ, నూర్జహాన్, విజయరాణి, కుమార్, కట్టయ్యల, పింఛన్‌దారులు, తదితరులు పాల్గొన్నారు.


