ఓటీ..లూటీ | - | Sakshi
Sakshi News home page

ఓటీ..లూటీ

Apr 10 2026 10:51 AM | Updated on Apr 10 2026 10:51 AM

ఓటీ..లూటీ – 8లోu

మేడారం మహాజాతరలో విధులు నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులకు ఓవర్‌ టైమ్‌ (ఓటీ) చెల్లింపులు చేయకుండా ఆర్థిక నష్టం కలిగించారు.

శునకం..

భయానకం

సాక్షి, వరంగల్‌: వేసవిలో కుక్క కాట్లు పెరుగుతున్నాయి. వేడితో ఒళ్లంతా చిమచిమలాడుతుంటుంది. చెమటతో చిరాగ్గా ఉంటుంది. ఈ కాలంలో మనుషుల మాదిరిగానే కుక్కలకు కూడా హీట్‌ స్ట్రెస్‌ మరింత ఎక్కువ ఉంటుది. దీంతో ఎండాకాలంలో కుక్కలు విపరీత ధోరణి ప్రదర్శిస్తూ ప్రజలను హైరానా పెడుతున్నాయి. వేసవి కుక్కలకు ఒత్తిడి కాలం.. వేడితోపాటు ఆహారం, నీటి లభ్యత తగ్గడంతో అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటివి వాటి వద్దకు వెళ్తే ఒక్కోసారి వాటంతటవే దాడి చేస్తున్నాయి. జనవరిలో 328 కేసులు, ఫిబ్రవరిలో 376 కేసులు నమోదైతే మార్చిలో 382 కేసులు పెరగడం జనాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కోతులు కూడా ఏమాత్రం తగ్గకుండా దాడులు చేస్తుండడంతో మూడు నెలల్లో 64 కేసులు నమోదయ్యాయి. ఇక ఇంట్లో పెంచుకుంటున్న పిల్లులు కూడా ఎండ భరించలేక కొన్ని సందర్భాల్లో యజమానులు, వారి పిల్లలను కరుస్తున్నాయి. జనవరిలో ఐదు, ఫిబ్రవరిలో 8 కేసులు నమోదైతే మార్చిలో ఏకంగా 12 పిల్లి కరిచిన ఘటనలు జరిగాయి. ఇవి వైద్యవిభాగ గణాంకాలు చెబుతున్నా వీరి దృష్టికి రాని కేసులు ఇంకా అనేకం ఉండొచ్చని తెలుస్తోంది. కొందరు వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానల్లో అందుబాటులో లేకపోవడంతో బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. రేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం బాధితులు ఆయా ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు పరుగులు తీస్తున్నారు. ఏప్రిల్‌, మేలో ఎండ వేడిమి మరింత పెరిగి కుక్క, కోతి, పిల్లి కాట్లు పెరిగే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

మూడు నెలల్లో 1,086 కాట్లు

వేసవిలో రెచ్చిపోతున్న కుక్కలు

వాటిదారిలోనే కోతులు, పిల్లులు కూడా..

దాడులతో భయాందోళన

చెందుతున్న ప్రజలు

రేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం పీహెచ్‌సీలకు బాధితుల పరుగులు

వాతావరణ మార్పులతోనూ దాడులు..

వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువసేపు ఇంటి బయట గడుపుతుంటారు. చిన్న పిల్లలైతే వారికి తోడుగా తల్లిదండ్రులు రోడ్లపైకి వస్తుంటారు. ఇలా మనుషుల సందడి పెరగడంతో కుక్కలు భయాందోళనతో దాడులు తెగిస్తున్నాయి. దీనికితోడు వాతావారణంలో మార్పులు, డీహైడ్రేషన్‌, సమ్మర్‌ స్ట్రెస్‌తో కుక్కలు బాగా ప్రభావితమవుతాయి. వ్యాక్సిన్‌ చేయించని కుక్కలు కరిస్తే రేబిస్‌ వచ్చే అవకాశముంటుంది. పిల్లలు కుక్కలను తరమవద్దు. రాళ్లు విసరడం, అరవడం లాంటివి చేయవద్దు. ఈ సందర్భాల్లో కుక్కలు దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కోతులు, పిల్లుల విషయంలోనూ అందరూ జాగ్రత్తలు పాటించడం మంచింది. ఆస్పత్రుల్లో రేబిస్‌ వ్యాక్సిన్‌ సరిపడా అందుబాటులో ఉంది. బాధితులకు వైద్యులు సత్వర వైద్యం చేయాల్సిందే. – సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement