
సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి
సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చేవారికి చికిత్సలు అందిస్తున్నాం. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తున్నాం. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మలేరియా, డెంగీ దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నాం. దోమల నిర్మూలనతోనే వ్యాధుల నివారణ సాధ్యం అవుతుంది. –డాక్టర్ సాంబశివరావు,
జిల్లా వైద్యారోగ్య అధికారి, వరంగల్