
‘కాళేశ్వరం’పై సర్కారు అసత్య ప్రచారం
గీసుకొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అసత్య ప్రచారం చేస్తోందని పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ అన్నారు. ఊకల్ పమీపంలోని ఎస్‌ఎస్ గార్డెన్‌లో ‘‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు–కమిషన్ వక్రీకరణ, వాస్తవాలు’ అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను వీక్షించిన అనంతరం వారు మాట్లాడారు. గతంలో అసెంబ్లీ, కేబినెట్, గవర్నర్ ఆమోదం పొందిన ప్రాజెక్టుకు అనుమతులు లేవని, ఏకపక్షంగా నిర్ణయించారని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. గ్రామాల్లో తిరగలేని స్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ సర్కారు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఘోష్ కమిషన్ నివేదికలో ఎన్నో తప్పులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమకు మైక్‌కట్ చేయకుండా కాళేశ్వరంపై మాట్లాడే అవకాశం ఇస్తే దుమ్ము దులుపుతామని చెప్పడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, సుదర్శన్‌రెడ్డి, నాయకులు నిమ్మగడ్డ వెంకన్న, బోడకుంట్ల ప్రకాశ్, పూండ్రు జయపాల్‌రెడ్డి, చల్లా వేణుగోపాల్‌రెడ్డి, అంకతి నాగేశ్వర్‌రావు, ముంత రాజయ్య, సిరిసె శ్రీకాంత్, సారంగపాణి, కోట ప్రమోద్ పాల్గొన్నారు.
పరకాల, నర్సంపేట,
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యేలు
చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్