
108 వాహనం తనిఖీ
దుగ్గొండి: మండల కేంద్రంలో 108 వాహనాన్ని జిల్లా మేనేజర్ నజీర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది రోగులకు సేవలందిస్తున్నారు, ఏ ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారు, బాధితుల నుంచి ఫోన్ వచ్చాక ఎంత సమయంలో అక్కడికి చేరి సేవలందిస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నా రు.108 సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, మెడికల్ టెక్నీషియన్ రేణుక, వాహన పైలట్ కోతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇళ్ల మంజూరు
పత్రాల పంపిణీ
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్‌కు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మంగళవారం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. హనుమకొండలోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. లబ్ధిదారులు నిబంధనల మేరకు గుడు వులోపు ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే నేరుగా తన దృష్టికి తేవాలన్నారు.
కేంద్రం నిధులతోనే
గ్రామాల అభివృద్ధి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
గంట రవికుమార్
పర్వతగిరి: కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చీమల భిక్షపతి ఆధ్వర్యంలో ‘ఇంటింటికి బీజేపీ–ప్రతి గడపగడపకు బూత్ అధ్యక్షుడు మహా సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలతో మహిళా సాధికారత సాకరమైందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పట్టాపురం ఏకాంతంగౌడ్, మండల ప్రభారి రేసు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి జాటోత్ రవి, ఉపాధ్యక్షుడు గోనె సంపత్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీమల చంద్రయ్య, బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్, మండల ఉపాధ్యక్షుడు పాయలి యాకయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బాదావత్ మారుతి, బూత్ అధ్యక్షులు నవీన్, భాస్కర్, వెంకన్న, కుమారస్వామి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు తాటికాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.