
ఇళ్లు, రేషన్‌కార్డులతో పేదల్లో సంతోషం
దుగ్గొండి/నల్లబెల్లి: ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులతో పేదలు సంతోషంగా ఉన్నారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి, నల్లబెల్లి మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నూతన రేషన్‌కార్డుల పంపిణీని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇళ్లు, రేషన్‌కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా హామీలను నెరవేరుస్తోందని తెలిపారు. యూరియా కొరత కృత్రిమంగా కొందరు సృష్టించిన వదంతులు మాత్రమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో వచ్చిన యూరియా కంటే నియోజకవర్గానికి 150 టన్నులు అదనంగా వచ్చిందని వివరించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే యూరియా వాడాలని, నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గానికి మొదటి విడత 3,750 ఇళ్లు మంజూరు చేశామని, ఇంకా కొంతమంది పనులు ప్రారంభించలేదన్నారు. వారంతా వెంటనే పనులు ప్రారంభిస్తే మరో 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అఽధికారి కిష్టయ్య, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు రాజేశ్వర్‌రావు, కృష్ణ, ఎంపీడీఓలు రవి, అరుంధతి, ఏఓలు, రజిత మాధవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్, ఎర్రల్ల బాబు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి