
వరంగల్
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
కేయూలో ఉద్రిక్తత
వంట చెరుకు తక్కువగా తీసుకొచ్చారని, భోజనంలో నాణ్యత లేదని కేయూలో విద్యార్థులు ఆందోళన చేశారు.
– 10లోu
వరంగల్ జిల్లా
నెల కుక్క కాటు కోతి కాటు పిల్లి కాటు పాము కాటు
జూన్ 154 7 5 0
జూలై 237 19 7 1
మొత్తం 391 26 12 1
హనుమకొండ జిల్లా
జూన్ 164 197 42 1
జూలై 157 214 21 0
మొత్తం 321 411 63 1
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్‌తోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కుక్కలు, కోతులు, ఇంట్లో పెంచుకునే పిల్లులు దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ఆస్పత్రులకు పరుగెడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వ్యవసాయ పనులు ఊపందుకున్న నేపథ్యంలో పాము కరుస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సిన జీడబ్ల్యూఎంసీ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పూర్తిగా శ్రద్ధ కనబరచకపోవడం, పట్టుకునే సుశిక్షితులైన సిబ్బంది అరకొరగా ఉండడం సమస్యకు కారణమవుతోంది. ఇలా కుక్కలు, కోతులు, పిల్లి, పాముల దాడులతో జనాలు బెంబేలెత్తుతున్నారు. వరంగల్, హనుమకొండ వైద్యశాఖ లెక్కల ప్రకారం రెండు నెలల్లోనే 1,226 కేసులు నమోదయ్యాయి. 712 కుక్కల కాట్లు, 437 కోతులు, 75 పిల్లి, రెండు పాము కాట్లు ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిన వారి సంఖ్య తీసుకుంటే ఇంకా భారీగానే కేసులు ఉండనున్నాయి. కుక్కలు, కోతుల దాడులు గ్రేటర్ వరంగల్‌లోనే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కార్పొరేషన్ అధికారులు దృష్టి సారిస్తే వీటి బెడద నుంచి జనాలు తప్పించుకునే అవకాశం ఉంది.
న్యూస్‌రీల్
ఇటీవల కొన్ని ఘటనలు..
నెక్కొండ మండలం అలంకానిపేట పీహెచ్‌సీ పరిధిలోని రెడ్యానాయక్ తండాకు చెందిన బాలు జూలై 28న వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కరిచింది. తోటి రైతులు చికిత్స కోసం ఆయనను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా యాంటీవెనమ్ ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం ఎంజీంకు తరలించారు. రెండు రోజులపాటు అక్కడ చికిత్స పొందిన బాలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
ఖానాపురం మండల కేంద్రానికి చెందిన శ్రీలత ఇంట్లో పిల్లిని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పిల్లి కాలుపై శ్రీలత కాలు వేయడంతో కొరికింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా వైద్యులు ఏఆర్వీ, టీటీ ఇంజక్షన్లు వేసి ఆమెను ఇంటికి పంపించారు.
సంగెం మండలంలోని సోమలతండా గ్రామానికి చెందిన గుగులోత్ వెంకన్నకు 15 రోజుల క్రితం ఇంటి వద్ద కుక్క కరిచింది. సంగెం పీహెచ్‌సీకి వెళ్లి మూడు రోజులపాటు ఇంజక్షన్లు తీసుకున్నాడు.
దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బూరుగు సాత్విక జూలై 27వ తేదీన ఇంటి ఆవరణలో కూర్చోగా వెనుక నుంచి వచ్చిన కోతి భుజం పైన కరిచింది. దీంతో ఆమె స్థానిక పీహెచ్‌సీలో వైద్యం చేయించుకుంది.
నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామానికి చెందిన బక్కి సాంబశివరాజు నానమ్మ వృద్ధురాలు లక్ష్మి జూలై 26న ఉదయం ఇంట్లో పనులు చేస్తుండగా కోతులు దాడి చేశాయి. దీంతో ఆమెకు నెక్కొండ పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఎంజీఎంకు తరలించారు.
కుక్కలు, కోతులు, పిల్లుల స్వైరవిహారంతో ప్రజల బెంబేలు
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో
1,226 కేసుల నమోదు
పీహెచ్‌సీల్లో మందులు
ఉన్నాయంటున్న వైద్యాధికారులు

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్