
ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి..
శరీరంపై ఎర్రమచ్చలు రావడం, చెవుల్లో నుంచి రక్తం కారడం, మలమూత్ర విసర్జన చేసినప్పుడు రక్తం రావడం, యూరిన్‌లో రక్తం రావడం, ఒంటిపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు రక్త పరీక్షలు చేసుకొని ప్లేట్‌లెట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డెంగీ, మలేరియా జ్వరాలు వచ్చాయని భయపడొద్దు. వ్యాధి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమం. ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకుంటే..దాదాపు దోమల బెడద నుంచి పూర్తిగా దూరమైనట్లే. దీంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎంజీఎం ఫీవర్ వార్డులో జ్వర సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందిస్తున్నాం.
–డాక్టర్ కిశోర్ కుమార్,
ఎంజీఎం సూపరింటెండెంట్