
ఆయిల్‌పామ్ రైతుల భవిష్యత్తుకు భరోసా
ఐనవోలు: ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో 100 శాతం భరోసా ఉంటుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అనసూయ తెలిపారు. సోమవారం మండలంలోని గర్మిళ్లపెల్లి గ్రామంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆయిల్‌పామ్ క్షేత్రంలో ఉద్యానశాఖ, కేఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి హెచ్‌ఓ అనసూయ మొక్క నాటి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే భవిష్యత్తు ప్రయోజనాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో రైతులు గోకె కరుణాకర్, ఆకారపు రాజిరెడ్డి, రంగు శ్రీకాంత్ చంద్ర, డివిజన్ హెచ్‌ఓ సుస్మిత, కేఎన్ బయో సైన్సెస్ ప్రతినిధులు, ఫీల్డ్ అధికారులు విక్రమ్, నాథన్, లక్ష్మణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యానశాఖ అధికారి అనసూయ