
వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణ సోమవారం పూజలు
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసంలోని ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారికి ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 100 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం జరిపించారు. మధ్యాహ్నం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణ సోమవారం పూజలు