
వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని అయా శాఖ అధికారులను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ స్నేహ శబరీశ్ హాజరై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 205 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్‌డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, అధికారులు పాల్గొన్నారు.