అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు
రాయపర్తి: పదేళ్ల నిరీక్షణ తర్వాత పేదల సొంతింటి కల నెరవేరుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. రాయపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, లబ్ధిదారులు ఎమ్మెల్యేను ఊరేగింపుగా మండల పరిషత్ కార్యాలయానికి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్లు అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన స్వల్పకాలంలోనే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మరికొద్ది రోజుల్లో తెల్లరేషన్‌కార్డులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నాగమణి, ఎంపీడీఓ కిషన్‌నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ ప్రకాశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణమాచార్యులు, అశోక్, గోవర్ధన్‌రెడ్డి, మునిత, వనజారాణి, మహేందర్‌రెడ్డి, కోటేశ్వర్, ఉస్మాన్, దామోదర్, యాదగిరి, సాయిలు, కుమార్, సుధాకర్, సేనాపతి, సాయిలు, యాకయ్య పాల్గొన్నారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో
అభివృద్ధి శూన్యం
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


