జిల్లా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం పంటమార్పిడి చాలా అత్యవసరం. వరి మాత్రమే పండిస్తే.. భవి ష్యత్‌లో ఇతర ధా న్యాల కోసం వేరే రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కావాల్సిన ఆహార ధాన్యాల ధరలు ఊహించని విధంగా పెరిగే ప్రమాదం ఉంది. జిల్లా నేలల్లో అన్నిరకాల పంటలు పండుతాయి. పంటమార్పిడితో భూమి ఆరోగ్యం కాపాడటంతో పాటు మన ప్రాంత ప్రజలకు కావాల్సిన అన్నిరకాల ఆహార ధాన్యాలు, కూరగాయలు, నూనెగింజలు ఇక్కడే పండించుకొని వినియోగించుకోవచ్చు. రైతులు ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.
– ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి
●


