సైబర్‌.. ఫీవర్‌! | - | Sakshi
Sakshi News home page

సైబర్‌.. ఫీవర్‌!

Apr 20 2026 7:18 AM | Updated on Apr 20 2026 7:18 AM

అమాయకులను చిత్తు చేస్తున్న మోసగాళ్లు

అవగాహనతోనే నేరాల నియంత్రణ..

జిల్లాలో కొంతకాలంగా సైబర్‌ క్రైం విభాగం డీఎస్పీ, సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌హెచ్‌ఓల సాయంతో విచారణ చేపడుతున్నాం. ఎక్కడా ఇబ్బందులు కలుగలేదు. సైబర్‌ నేరాలపై నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కొత్త పంథాల్లో వల పన్ని అమాయకులను మోసం చేస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామంటూ వచ్చే కాల్స్‌కు ఎవరూ స్పందించొద్దు. బ్యాంకర్లు రుణాలు ఇస్తామంటూ ఫోన్లు చేయరు. ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్పీ పేరుతో డబ్బులు లాగే ప్రయత్నం చేస్తే సమాచారం ఇవ్వండి. – రవిప్రకాష్‌, ఎస్‌ఐ,

సైబర్‌క్రైం విభాగం, వనపర్తి

వనపర్తి: పోలీసు అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. సైబర్‌ నేరగాళ్లు అమాయక ప్రజలను ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో మోసం చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో సైబర్‌ నేరాల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది. పోలీసులు ఓ వైపు సాంకేతికతను వినియోగించి సైబర్‌ నేరాలను ఛేదిస్తున్నా.. ఈజీమనీకి అలవాటు పడిన కొందరు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ నెల నాలుగో తేదీన గోపాల్‌పేటకు చెందిన వి.నర్సింహకు బజాజ్‌ ఫైనాన్స్‌లో రూ.5 లక్షల రుణం మంజూరైందని.. ప్రాసెసింగ్‌ ఫీజు, అప్రూవల్‌ ఫీజు, జీఎస్టీ పేరుతో సుమారు రూ.77,400 స్వాహా చేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది.

కొత్త పంథాలతో మోసగిస్తున్న వైనం

జిల్లాలో ఏటా పెరుగుతున్న కేసులు

తాజాగా గోపాల్‌పేటలో రుణం ఇప్పిస్తామంటూ రూ.77,400 స్వాహా

Advertisement
 
Advertisement
Advertisement