పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

Apr 26 2025 12:21 AM | Updated on Apr 26 2025 12:21 AM

పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

పాన్‌గల్‌: పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని జిల్లా మాత, శిశు సంరక్షణ అధికారి డా. ఝాన్సీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్యసిబ్బంది తమ సబ్‌సెంటర్ల పరిధిలోని గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించాలన్నారు. గర్భిణులు 102, 108 వాహన సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. పీహెచ్‌సీలో జరిగిన ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డా. చంద్రశేఖర్‌, సీహెచ్‌ఓ రామయ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement