రైతు కంట్లో కారం..!

జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడులో  మిర్చి పంటలో తాలు ఏరుతున్న మహిళలు  - Sakshi

దళారుల చేతిలో నిలువునా దగా

తక్కువ ధరకు స్థానిక వ్యాపారుల కొనుగోళ్లు

నడిగడ్డలో మిర్చి మార్కెట్‌

లేకపోవడమే కారణం

కర్ణాటక, ఏపీకి రవాణా..భారీగా పెరిగిన ఖర్చు

రోజుల తరబడి పడిగాపులు..తిండికీ తప్పని తిప్పలు

పెట్టుబడి కూడా రాని పరిస్థితి..ఆందోళనలో రైతులు

విధి లేక ఇతర రాష్ట్రాలకు..మరింత భారం..

స్థానికంగా దళారులు దోపిడీ చేస్తుండడంతో అధిక సంఖ్యలో రైతులు మిర్చిని హైదరాబాద్‌, గుంటూరు, కర్ణాటకలోని బళ్లారి, హుబ్లీ మార్కెట్లకు వ్యయప్రయాసలకు ఓర్చి వాహనాల్లో తరలిస్తున్నారు. రవాణాకే పెద్ద ఎత్తు ఖర్చవుతుండడం రైతులకు అదనపు భారంగా మారింది. ఏ రోజుకా రోజు ధరల్లో వ్యత్యాసం ఉంటుండగా.. అధిక ధర కోసం ఒక్కోసారి వారంరోజులకు పైగా అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో తిండికీ తిప్పలుపడడంతో పాటు రైతులు ఆర్థికంగా మరింతగా నష్టపోతున్నారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని అమ్ముకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎర్రబంగారం క్రయవిక్రయాలకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడులకు తోడు తగ్గిన దిగుబడులతో ఆందోళనలో ఉన్న రైతాంగాన్ని.. దళారుల చర్యలు మరింతగా కుంగదీస్తున్నాయి. మార్కెట్‌ లేదనే సాకుతో వ్యాపారులందరూ కుమ్మకై ్క అతి తక్కువ ధరతో కొంటూ నిలువు దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడి సైతం రాని పరిస్థితుల్లో రైతులకు కన్నీళ్లే దిక్కవుతున్నాయి.

39 వేల ఎకరాల్లో సాగు..

ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా నడిగడ్డగా పేరొందిన గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో వాణిజ్య పంటగా మిర్చిని అధికంగా సాగు చేస్తున్నారు. అక్కడి భూములు మిర్చి పంటకు అనుకూలంగా ఉండడంతో సొంతభూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు ఎక్కువ సంఖ్యలో ప్రతి ఏటా మిర్చినే సాగు చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 39 వేల ఎకరాల్లో మిర్చి సాగు కాగా.. గద్వాల జిల్లాలోనే 35,354ఎకరాల్లో సాగు కావడం విశేషం. ఈ సారి అధిక వర్షాలతో పాటు పంటను తెగుళ్లు ఆశించడంతో దిగుబడి భారీగా తగ్గింది.

ఎకరాలు

పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి

ఈ ఏడాది మిర్చికి నల్ల తామర సోకడంతో రైతు లు లెక్కకు మించి పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడి వ్యయం అమాంతంగా పెరిగింది. ఎకరా విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు మొత్తం కలుపుకొని సుమారు రూ.లక్ష వరకు ఖర్చు వచ్చిందని రైతులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించి ఎలాంటి తెగుళ్లు ఆశించకపోతే.. ఎకరాకు 18నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. తెగుళ్ల కా రణంగా ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటా ళ్లు మాత్రమే దిగుబడి వచ్చినట్లు తెలుస్తోంది.

Read latest Wanaparthy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top