శృంగవరపుకోట:
మండలంలోని తాటిపూడి వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల కళాశాలలో జ్వరాల బారినపడిన విద్యార్థినులను మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం పలువురు నేతలతో కలిసి పరామర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థినులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అక్కడే ఉన్న కొ ట్టాం పీహెచ్‌సీ వైద్యాధికారి హారికతో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న సేవల గురించి, ప్రిన్సి పాల్ శారదాబాయితో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం, కళాశాలలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతులు,ఇతర సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎటువంటి అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, నాయకులు వాకాడ రాంబాబు, కె.వెంకటరావు, టి.సాంబరాజు, డి.సన్యా సిదేముడు, ఆల్తి బాబురావు, ఎస్.కనకం, చిన్నా మాస్టర్ ఉన్నారు.


