500 క్యూసెక్కుల నీరు సరఫరా
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్టు ఏఈ నితిన్ బుధవారం తెలిపారు. దశల వారీగా సాగునీటి విడుదలను పెంపుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 62.10 మీటర్లమేర నీరు నిల్వ ఉందన్నారు.
జీఓ 396 రద్దు చేయాలి
దస్తావేజు లేఖరుల వ్యవస్థనే కనుమరుగు చేసి, వారి జీవనోపాధికి గండికొట్టేలా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 396ను తక్షణమే రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ప్రైవేటే సంస్థలకు లాభం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాం.
– రామసింగు సత్యప్రసాదరావు, సీనియర్ దస్తావేజు లేఖరి, విజయనగరం
కడుపు కొట్టొద్దు
జీఓ–396తో దస్తావేజు లేఖరుల కడుపు కొట్టొద్దు. దశా బ్దాల చరిత్ర ఉన్న దస్తావేజు లేఖరుల బతుకులు రోడ్డున పడేయడం సరికాదు. ఎంతోమంది నిరుద్యోగులం ఈ వ్యవస్థపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలి.
– ఎస్.వెంకటేష్, దస్తావేజు లేఖరి, విజయనగరం
విజయనగరం రూరల్: చంద్రబాబు సర్కార్ సంపద సృష్టి ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ల సేవా కేంద్రాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం జీఓ 396 జారీ చేసింది. ఈ కేంద్రాల బాధ్యతలను తన అనుచర గణానికి అప్పగించాలన్నది చంద్రబాబు తెరవెనుక ఉద్దేశమన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై దస్తావేజు లేఖరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ జీవనోపాధికి గండికొడుతూ తీసుకువచ్చిన జీఓకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఈ నెల 20 నుంచి పెన్‌డౌన్‌తో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. వారం రోజులకు పైబడి రిజిస్ట్రేషన్లు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
తప్పులకు ఆస్కారం
ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 396తో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ద్వారా దస్తావేజులు రూపొందించబడతా యి. అయితే, ఈ ప్రక్రియకు రూ. 2వేలు ఫీజుతో పాటు 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఆస్తి కొనుగోళ్లకు సంబంధించి ఈ ప్రక్రియలో ఎంతో క్షుణ్ణంగా పరిశీలన చేసినా చాలా సమయం పడుతుందని, పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే తప్పులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని క్రయవిక్రయదారులు పేర్కొంటున్నారు. కేంద్రాల బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి, కమీషన్లు కొట్టేసి, తద్వారా కూటమి నేతలు డబ్బులు సంపాదనకే కొత్త జీఓ జారీచేసిందని దస్తావేజు లేఖరులు ఆరోపిస్తున్నారు. వందేళ్లకు పైబడి ఉన్న దస్తావేజు లేఖరుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలన్న చంద్రబాబు సర్కారు ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఈ నెల 6, 7 తేదీల్లో తొలివిడత పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండివైఖరి వీడకపోవడంతో ఈ నెల 20 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మె చేపడుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అరకొర రిజిస్ట్రేషన్లే సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
రోడ్డున పడనున్న కుటుంబాలు
జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు 300కు పైబడి ఉంటారు. స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, దస్తావేజు లేఖరుల సహాయకులు, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు అందరూ కలిపి సుమారు 1100 మందికి మించి ఉంటారు. వీరిలో అనేకమంది నిరుద్యోగులే. చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీఓ 396తో ప్రత్యక్షంగా 1100 కుటుంబాలు, పరోక్షంగా మరో 300 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, లేకుంటే నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఉన్న జీవనోపాధిని తీసేసి తమ కడుపు కొడుతోందని దస్తావేజు లేఖరులు మండిపడుతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి
ప్రభుత్వం ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుకు జీఓ నంబర్ 396 జారీ
జీఓపై ఆగ్రహంతో ఈ నెల 20 నుంచి దస్తావేజుల లేఖర్ల పెన్‌డౌన్
తమ జీవనోపాధికి గండికొట్టొద్దంటున్న దస్తావేజు లేఖర్లు
9 రోజుల్లో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్
శాఖ ఆదాయం


