డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడో?

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

రాజాం సిటీ: ఇంటర్మీడియట్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మాత్రం ప్రారంభంకాలేదు. ఇంటర్‌ పాసైన విద్యార్థులకు డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి అడ్మిషన్లపై ఎలాంటి స్పష్టత రాకపోవడం విద్యావర్గాలను కలవరపెడుతోంది. సర్కారు తీరును ఆక్షేపిస్తోంది.

జూలై ముగుస్తున్నా..

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఏ కళాశాలలో ఏ గ్రూపులో జాయిన్‌ కావాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారిక నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంతో వేచి చూడాల్సివస్తోంది. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైతే విద్యాసంవత్సరం ప్రారంభం కూడా ఆలస్యమౌతుందని కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అడ్మిషన్లు పూర్తయ్యాక తరగతులు ప్రారంభించడంతో పాటు అకడమిక్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు సమయం అవసరమని పేర్కొంటున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమైతే సెమిస్టర్‌ బోధనపై ప్రభావం పడే అవకాశం ఉందని, యూనివర్సిటీలు రూపొందించిన అకడమిక్‌ క్యాలెండర్‌, పరీక్షల షెడ్యూల్‌ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల విద్యాప్రగతి మందగించే అవకాశం ఉందంటున్నారు.

కళాశాలల వసతులుపై ఆరా......

ఉన్నత విద్యామండలి అధికారులు డిగ్రీ కళాశాలల్లో వసతులపై ఆరా తీశారు. ఉన్నత విద్యామండలికి నివేదిక అందజేశారు. ఈ ప్రక్రియ పూర్తయి 20 రోజులు గడుస్తున్నా నేటికీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ వెలువడలేదు.

రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

జూలై ముగిసినా విడుదకాని

నోటిఫికేషన్‌

సెమిస్టర్లపై పడనున్న ప్రభావం

ఎఫ్‌ఆర్‌ఎస్‌పై సందిగ్దం

ఆందోళనలో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు

ఎఫ్‌ఆర్‌ఎస్‌పై సందిగ్ధం....

ప్రతి విద్యార్థి కళాశాలకు రావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌తో కళాశాలల యాజమాన్యాలు సందిగ్ధంలో పడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి నిర్వహిస్తున్న కళాశాలలకు మరింత తలనొప్పిగా మారింది. విద్యార్థులు ప్రతిరోజు హాజరైనా వారికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసేందుకే సమయం సరిపోదని, దీంతో తరగతులు నిర్వహించేదెలా అని వాపోతున్నారు. ఇప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు అరకొరగానే ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేస్తున్నామని, ఈ ప్రభావం ఫీజురీయింబర్స్‌మెంట్‌పై పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లు సక్రమంగా పనిచేయకపోవడం, ఫేస్‌లు సరిగా పడకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement