చీపురుపల్లిరూరల్(గరివిడి): జిల్లా మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్న మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గరివిడిలోని పార్టీ కార్యాలయంలో బుదవారం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, యువ నాయకురాలు బొత్స అనూషతో కలిసి పలువురు నాయకులు సమావేశమయ్యారు. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు, కార్యకర్తలు పైడిబీమవరం వద్ద గల మహిగ్రాండ్ ఇన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో స్వాగతం పలకాలని నిర్ణయించారు. శాసనమండలి విపక్షనాయకుడు బొత్స సత్యనారాయణ సూచనలతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తీక్, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, తాడ్డి వేణు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.వి.సూర్యనారాయణరాజు, సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.


