ఇది చెరువుకాదు.. మేము ప్రయాణించే రోడ్డు. దీనిని బాగుచేసి ప్రయాణ కష్టాలు తొలగించాలని నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.. పల్లెపండగ పేరుతో రోడ్డును అద్దంలా మెరిపిస్తామని మురికి కూపంగా మార్చారంటూ వేపాడ గ్రామస్తులు వాపోయారు. బుధవారం సైతం దీక్ష కొనసాగించారు. చంద్రబాబు సర్కారు తీరుతో మా రోడ్డు కష్టాలు తీరడంలేదంటూ మండిపడ్డారు. వీరికి రైతు ఉద్యమనేత చల్లా జగన్‌తో పాటు వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, వైస్ ఎంపీపీ ఈశ్వరరావు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జగ్గుబాబం, అరిగిపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యుడు సన్యాసిరావు తదితరులు సంఘీభావం తెలిపారు. నిధులున్నా రోడ్డు పనులు చేయకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. – వేపాడ


